నేడు పార్టీ నేతలతో వైఎస్ జగన్ సమావేశం

వైసీపీ నేతలతో సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు భేటీ కానున్నారు. పార్టీ బలోపేతం, నియోజకవర్గాల ఇంఛార్జుల నియామకంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Update: 2024-10-17 06:52 GMT

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. నేడు పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలతో జగన్ సమావేశమై.. పూర్తిస్థాయి కార్యవర్గాల ఏర్పాటు సహా.. పలు అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా బూత్ లెవల్ లో పార్టీ కేడర్ ను చైతన్యం చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే నియోజకవర్గాల వారిగా సమీక్షల నిర్వహించి.. ఇంఛార్జుల నియామకాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మంగళగిరి, రేపల్లె నియోజకవర్గాలకు ఇప్పటికే వైసీపీ కొత్త ఇంఛార్జులను నియమించింది. రానున్న రోజుల్లో మిగతా నియోజకవర్గాలకు కూడా ఇంఛార్జులను నియమించడంపై ఈ సమావేశంలో చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా వైఎస్ జగన్ ప్లాన్ చేస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీ నేతలతో నిర్వహించే సమావేశాలతో భవిష్యత్ కార్యాచరణపై ఒక నిర్ణయం తీసుకోనున్నారని కూడా అంటున్నారు. 


Similar News