పేలిన ప్ర‌తీ త‌ప్పుడు కూత‌కీ వాత పెట్టించీ..బొక్క‌లో వేస్తాం: విజయసాయిరెడ్డిపై అయ్యన్న ఫైర్

వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డికి మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Update: 2023-11-28 07:42 GMT
పేలిన ప్ర‌తీ త‌ప్పుడు కూత‌కీ వాత పెట్టించీ..బొక్క‌లో వేస్తాం: విజయసాయిరెడ్డిపై అయ్యన్న ఫైర్
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డికి మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పీకల్లోతు కేసుల్లో ఇరుక్కుని..అధికారంపోతే నీ బ‌తుకేంటో తెలియ‌క మెదడువాపు వ్యాధి వ‌చ్చి పిచ్చి ట్వీట్లు వేస్తున్న దొంగ‌సాయి అంటూ మండిపడ్డారు.మూడు నెల‌ల త‌రువాత ఏ దేశం పారిపోదామా అని ప్లాన్లు వేస్తున్నావ‌ట‌! స‌ప్త‌స‌ముద్రాల అవ‌త‌ల దాక్కున్నా లాక్కొచ్చి తిన్న‌దంతా క‌క్కించి, పేలిన ప్ర‌తీ త‌ప్పుడు కూత‌కీ వాత పెట్టించీ..బొక్క‌లో వేస్తాంరా దొంగ సాయిగా అంటూ ఘాటుగా హెచ్చరించారు. ఈ మేరకు అయ్యన్నపాత్రుడు మంగళవారం ట్వీట్ చేశారు. ‘మీ అల్లుడు న‌త్తి ప‌కోడీగాడిని అప్పుడు ఎవరు నడవమన్నారు దొంగ సాయి! క‌నిపించిన‌వాళ్ల‌క‌ల్లా ముద్దులు పెట్టి, మూతులు నాకి మీ అల్లుడు ఎందుకు చేశాడురా పాడెయాత్ర‌. న‌డ‌వ‌లేక కోర్టు వాయిదాల పేరుతో యాత్ర‌ని వాయిదా వేసుకోవ‌డం మీ దొంగ‌ల్లుడికే చెల్లు. పీక‌ల్లోతు కేసుల్లో ఇరుక్కుని, అధికారంపోతే నీ బ‌తుకేంటో తెలియ‌క మెదడువాపు వ్యాధి వ‌చ్చి పిచ్చి ట్వీట్లు వేస్తున్న దొంగ‌సాయి..మూడు నెల‌ల త‌రువాత ఏ దేశం పారిపోదామా అని ప్లాన్లు వేస్తున్నావ‌ట‌! స‌ప్త‌స‌ముద్రాల అవ‌త‌ల దాక్కున్నా లాక్కొచ్చి తిన్న‌దంతా క‌క్కించి, పేలిన ప్ర‌తీ త‌ప్పుడు కూత‌కీ వాత పెట్టించీ..బొక్క‌లో వేస్తాంరా దొంగ సాయిగా’ అంటూ ట్వీట్‌లో పొందుపరిచారు.

యువగళంపై విజయసాయిరెడ్డి

అంతకుముందు నారా లోకేశ్ యువగళం పాదయాత్రపై వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఎవరు నడవమన్నారో..ఎందుకు పెట్టుకున్నారో యువగళం పాదయాత్ర అంటూ సెటైర్లు వేశారు. నడక భారమై బిత్తర సవాళ్లు విసరుతున్నారు లోకేశ్ అంటూ ఘాటుగా విమర్శించారు. గాలికుంట్లు, బ్లూ టంగ్ వ్యాధులేమైనా సోకి నాలుక వాచిందేమో టెస్ట్ చేయించుకోండి చినబాబు అంటూ ట్విటర్ వేదికగా హితవు పలికారు. ఛాలెంజికి కూడా ఒక స్థాయి ఉండాలి అంటూ వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Tags:    

Similar News