ఆపరేషన్ చేయించుకున్నా..బెయిల్ పొడిగించండి: సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్

మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి ఎస్కార్ట్ బెయిల్‌పై ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే.

Update: 2023-10-01 09:02 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి ఎస్కార్ట్ బెయిల్‌పై ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఎస్కార్ట్ బెయిల్‌ను పొడిగించాలని కోరుతూ వైఎస్ భాస్కర్ రెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎస్కార్ట్ బెయిల్ పొందిన అనంతరం కంటికి శస్త్ర చికిత్స చేసుకున్నానని...కొన్ని రోజులపాటు విశ్రాంతి అవసరం అని కోర్టుకు తెలిపారు. వైద్యులు సూచనలు, తదుపరి చికిత్సల నేపథ్యంలో బెయిల్‌ను మరో రెండు నెలలపాటు పొడిగించాలని కోరుతున్నట్లు విజ్ఞప్తి చేశారు. తన అనారోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని బెయిల్ పొడిగించాలని పిటిషన్‌లో వైఎస్ భాస్కర్ రెడ్డి కోరారు. వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు ఈనెల 3న విచారించనున్నట్లు తెలిపింది. ఇకపోతే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ నిందితుడిగా పేర్కొంది. కొన్నినెలలుగా జైల్లో ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి ఇటీవలే అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఎస్కార్ట్ బెయిల్‌పై విడుదలయ్యారు. అక్టోబర్ 3వరకు సీబీఐ కోర్టు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో రెండు నెలలపాటు పొడిగించాలంటూ వైఎస్ భాస్కర్ రెడ్డి కోరారు.  

Tags:    

Similar News