AP News:సత్యదేవుని సన్నిధిలో ఏపీ హైకోర్టు జడ్జి

ఏపీ హైకోర్టు జడ్జి వెంకట జ్యోతిర్మయి ప్రతాప ఇవాళ(సోమవారం) కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని సన్నిధికి కుటుంబ సమేతంగా విచ్చేశారు

Update: 2025-04-14 09:14 GMT
AP News:సత్యదేవుని సన్నిధిలో ఏపీ హైకోర్టు జడ్జి
  • whatsapp icon

దిశ ,అన్నవరం: ఏపీ హైకోర్టు జడ్జి వెంకట జ్యోతిర్మయి ప్రతాప ఇవాళ(సోమవారం) కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని సన్నిధికి కుటుంబ సమేతంగా విచ్చేశారు. వీరికి ఆలయ అధికారులు దేవస్థానం సాంప్రదాయం ప్రకారం.. వీఐపీ ప్రోటోకాల్ పద్ధతిలో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్ల వ్రతం ఆచరించిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేద పండితులు జడ్జి కుటుంబ సభ్యులకు ఆశీర్వచనములు అందించగా ఆలయ అధికారులు, ప్రోటోకాల్ అధికారులు స్వామి వారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో కోర్టు సిబ్బంది తదితరులు ఉన్నారు.

Similar News