Earthquake:ప్రకాశంలో మరోసారి భూప్రకంపనలు
ఏపీలో వరుస భూ ప్రకంపనలు(Earth tremors) ప్రజలను భయాందోళనకు(panic) గురి చేస్తున్నాయి.
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో వరుస భూ ప్రకంపనలు(Earth tremors) ప్రజలను భయాందోళనకు(panic) గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా(Prakasam District)లోని ముండ్లమూరు మండలం లో గత డిసెంబర్ నెలలో భూమి స్వల్పంగా కంపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకాశంలో మరోసారి నేడు(గురువారం) భూప్రకంపనలు కలకలం రేపాయి. ముండ్లమూరు(Mundlamoor) పరిసర ప్రాంతాల్లో సెకన్ పాటు భూమి కంపించింది. మధ్యాహ్నం 1:43 గంటలకు భూమి కంపించినట్లు సమాచారం. భయాందోళనలకు గురైన స్థానికులు ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. వరుస భూ ప్రకంపనలు రాష్ట్రంలో సంభవించడంతో ఎప్పుడు ఏం జరుగుతోందనని ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.