Eagle:గంజాయి, డ్రగ్స్ పై ఈగల్ చీఫ్ సంచలన ప్రకటన
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) గంజాయి, మాదకద్రవ్యాల(Drugs) పై ఉక్కుపాదం మోపేందుకు ఈగల్ (ఎలైట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ లా ఎన్ ఫోర్స్ మెంట్)ని అమల్లోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే.
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) గంజాయి, మాదకద్రవ్యాల(Drugs) పై ఉక్కుపాదం మోపేందుకు ఈగల్ (ఎలైట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ లా ఎన్ ఫోర్స్ మెంట్)ని అమల్లోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈగల్ చీఫ్(Eagle Chief)గా ఆకే రవికృష్ణ(Ravi Krishna)ను నియమించారు. ఈ సందర్భంగా మీడియాతో రవికృష్ణ మాట్లాడుతూ.. డ్రగ్స్ తీసుకున్న, సరఫరా చేసినా నేరమేనని చెప్పారు. డ్రగ్స్, గంజాయి నివారణపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని తెలిపారు. నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ (NDPS) చట్టం ఎంత కఠినమైనదో అందరికీ తెలియాలని చెప్పారు. ఈ కేసుల్లో దోషులుగా తేలితే ఏడాది నుంచి 20 ఏళ్ల వరకు శిక్షలు ఉన్నాయని తెలిపారు. రూ. 2 లక్షలకు పైగా జరిమానా విధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ చట్టం కింద విద్యార్థిపై కేసు నమోదైతే అతనికి చాలా నష్టం జరుగుతుందని అన్నారు.