టీడీపీకి బానిసత్వం చేయడానికి మేము సిద్ధంగా లేము.. జనసేన నేతల ప్రకటన

ఎన్నికల వేళ పి.గన్నవరంలో టీడీపీ-జనసేన కూటమి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ నేతలు తమను పట్టించుకోవడం లేదని జనసేన నేతలు ఆందోళనకు దిగారు.

Update: 2024-03-28 16:13 GMT
టీడీపీకి బానిసత్వం చేయడానికి మేము సిద్ధంగా లేము.. జనసేన నేతల ప్రకటన
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ పి.గన్నవరంలో టీడీపీ-జనసేన కూటమి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ నేతలు తమను పట్టించుకోవడం లేదని జనసేన నేతలు ఆందోళనకు దిగారు. తమ అధినేత పవన్ కల్యాణ్ పిలుపును గౌరవించి తాము టీడీపీకి మద్దతుగా పనిచేస్తున్నామని అన్నారు. కానీ, టీడీపీ నేతలు తమను కలుపుకొని పోవడం లేదంటూ గన్నవరం జనసేన ఇన్‌చార్జి చలమలశెట్టి రమేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీకి బానిసత్వం చేయడానికి తాము సిద్ధంగా ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. టీడీపీ నేతలు చేసే ప్రసంగాల్లో జనసేన గురించి మాట్లాడకపోతే తాము టీడీపీతో కలిసి ముందుకు సాగలేమని తెగేసి చెప్పారు.

Read More : స్పీడ్ పెంచిన జనసేనాని.. అక్కడి నుంచే ఎన్నికల ప్రచారం

Tags:    

Similar News