వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపుపై డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ‘అరకు సమీపంలోని కురిడి గ్రామాన్ని పవన్ కల్యాన్ సందర్శించారు.

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా ‘అరకు (Araku) సమీపంలోని కురిడి గ్రామాన్ని పవన్ కల్యాన్ సందర్శించారు. అనంతరం అక్కడి ప్రజలతో మాట్లాడారు. అలాగే అక్కడే అధికారులతో పాటు ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ ఇతర అధికారులతో పాటు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తాను ఇచ్చిన మాట ప్రకారం అరకులో అభివృద్ధి చేసి చూపిస్తానని మరోసారి హామీ ఇచ్చారు.
అలాగే తన దత్తత గ్రామం (Adoptive village) కంటే ఎక్కువ పనులు కురిడిలో చేయిస్తున్నానని.. ఇలాగే కొనసాగిస్తానని ప్రజలకు హామి ఇచ్చారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న పలువురు వాలంటీర్‌లు (Volunteers) తమను తిరిగి విధుల్లోకి తీసుకోవడంపై ప్రశ్నించారు. కాగా వారి ప్రశ్నలపై పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. ఎన్నికల సమయంలో, ఎన్నికల తర్వాత వాలంటీర్లను కొనసాగిస్తామని హామీ ఇచ్చాము. కానీ గత ప్రభుత్వంలో వాలంటీర్లు ప్రభుత్వానికి సంబంధం లేకుండా పని చేశారు. వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిన ఏ డాక్యుమెంట్, జీవో ప్రభుత్వం దగ్గర లేదని అన్నారు. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ (Volunteer system) ఉన్నట్లు అధికారికంగా దాఖలాలే లేవని, ప్రభుత్వ ఉద్యోగం (Govt job) అని చెప్పి వాలంటీర్లను గత ప్రభుత్వంలో మభ్యపెట్టారని పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు.