తప్పు చేశారు కాబట్టే డిప్యూటీ సీఎం పవన్‌ ప్రాయశ్చిత్త దీక్ష: మాజీ మంత్రి వేణు

Update: 2024-09-26 10:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల లడ్డూ (Tirumala Laddu) తయారీలో కల్తీ నెయ్యి(adulterated ghee) వ్యవహారంపై మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు (Former Minister Chelloboena Venu) స్పందించారు. గురువారం మధ్యాహ్న ఓ ప్రముఖ మీడియా ఛానల్ తో ఆయన మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యికి సంబంధించి.. జూన్ 12 నుంచి ఏఆర్ డెయిరీ సప్లై మొదలైందని.. అప్పటికే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. అలాగేజూన్‌ 12 తర్వాత నెయ్యి క్వాలిటీ లేదని.. వెనక్కి పంపామని చెప్పినట్లు గుర్తు చేశారు. కూటమి నేతలు ఆరోపిస్తున్నట్లు.. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి కలిసిందనడానికి ఆధారాలు లేవని, రాష్ట్రంలో ప్రాయశ్చిత్త దీక్ష చేయాల్సింది సీఎం చంద్రబాబు నాయుడుని ప్రాయశ్చిత్త దీక్ష చేయాల్సింది చంద్రబాబు మాజీ మంత్రి అన్నారు. అలాగే లడ్డూ వ్యవహారంలో తప్పు చేశారు కాబట్టే డిప్యూటీ సీఎం పవన్‌ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారని మాజీ మంత్రి వేణు చెప్పుకొచ్చారు. కాగా లడ్డూ వ్యవహారంపై ఈ నెల 28 వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆలయాల్లో పూజలు నిర్వహించాలని వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చారు.


Similar News