తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

చాలా మంది హిందువులు ఎంతో భక్తి శ్రద్దలతో తిరుమల తిరుపతి దేవస్థానానికి అధిక సంఖ్యలో వెళుతుంటారు.

Update: 2023-04-15 04:33 GMT
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: చాలా మంది హిందువులు ఎంతో భక్తి శ్రద్దలతో తిరుమల తిరుపతి దేవస్థానానికి అధిక సంఖ్యలో వెళుతుంటారు. కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే నిన్న (శుక్రవారం) ఏప్రిల్ 14న తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిపోయింది. వైకుంఠం క్యూ కంప్లెక్స్ మొత్తం భక్తులతో నిండిపోయింది. దీంతో టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది. ఎండాకాలం కావడంతో జనాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తుంది. నిన్న శ్రీవారిని 66,310 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 31, 980 మంది తలనీలాలకు సమర్పించుకున్నారు. శుక్రవారం ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3. 16 కోట్లు వచ్చినట్టు సమాచారం.  

ఇవి కూడా చదవండి:

తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త..!  

Tags:    

Similar News