CPI: ఏపీ చరిత్రలో ఎప్పుడు లేనంతగా విద్యుత్ భారం.. సీపీఐ నేత రామకృష్ణ
ఆంధ్రప్రదేశ్ చరిత్ర(AP History)లో ఎప్పుడు లేనంతగా ప్రజలపై విద్యుత్ భారం(Electricity Charges) మోపుతున్నారని సీపీఐ నేత రామకృష్ణ(CPI Ramakrishna) అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ చరిత్ర(AP History)లో ఎప్పుడు లేనంతగా ప్రజలపై విద్యుత్ భారం(Electricity Charges) మోపుతున్నారని సీపీఐ నేత రామకృష్ణ(CPI Ramakrishna) అన్నారు. కర్నూలు(Kurnool)లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభుత్వం(AP Govt)పై ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలకు బిన్నంగా ప్రజలపై భారం మోపుతోందని, రాష్ట్ర చరిత్రలో మొదటిసారి రూ.17,800 కోట్ల విద్యుత్ భారం ప్రజలపై ఈ కూటమి ప్రభుత్వం మోపుతోందని తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగింది అనే పేరుతో ప్రజల పై భారం మోపడానికా మీకు అధికారం ఇచ్చింది నిలదీశారు.
అలాగే కప్పట్రాళ్ల యురేనియం(Kappatralla Urenium) కోసం 11 ఎకరాల్లో 68 బోర్లు వేసేందుకు ప్రభుత్వం సిద్దం చేస్తోందని, గతంలో వ్యతిరేకించి, అధికారం వచ్చాక తవ్వకాలు జరిపితే ఎలా అని ప్రశ్నించారు. అంతేగాక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఈ ప్రాంతాన్ని సందర్శించి, పరిశీలించాలని సూచించారు. ఇక బెదిరింపుల ద్వారా యురేనియం తవ్వకాలకు వ్యతరేకంగా జరుగుతున్న ఆందోళనలు ఆపాలని చూస్తే ఉద్యమాలు ఆగవని హెచ్చరించారు.