CPI Ramakrishna:డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు లేఖ రాసిన సీపీఐ నేత

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌(AP Deputy CM Pawan Kalyan)కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ(CPI Ramakrishna) లేఖ రాశారు.

Update: 2024-12-01 06:13 GMT
CPI Ramakrishna:డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు లేఖ రాసిన సీపీఐ నేత
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌(AP Deputy CM Pawan Kalyan)కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ(CPI Ramakrishna) లేఖ రాశారు. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం లో అత్యం మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్(Atyam Mining Private Limited) అక్రమ మైనింగ్(Illegal mining) ఆపాలని లేఖలో కోరారు. ఈ ప్రాంతంలో డ్రిల్లింగ్ వల్ల భూగర్భ జలాలు, తాగునీరు కలుషితమయ్యాయి అని పేర్కొన్నారు. ఈ క్రమంలో కిడ్నీ వ్యాధులకు గురై ఇప్పటికే 12 మంది మృతి చెందగా.. అనేక మంది అనారోగ్యం పాలయ్యారని చెప్పారు. అక్రమ మైనింగ్ గోతుల వల్ల కొండపై నుంచి దిగువ పొలాలకు వర్షపు నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. అత్యం మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌పై కఠిన చర్యలు చేపట్టాలని సీపీఐ నేత లేఖలో పేర్కొన్నారు.

Tags:    

Similar News