Tirupati: తిరుమల తిరుపతి లో కొనసాగుతున్న భక్తుల రద్దీ
కార్తీక మాస ప్రారంభంలో తిరుమల తిరుపతి( Tirumala Tirupati)లో కాస్త తగ్గిన భక్తుల రద్దీ.. మరోసారి పెరిగింది.
దిశ, వెబ్ డెస్క్: కార్తీక మాస ప్రారంభంలో తిరుమల తిరుపతి( Tirumala Tirupati)లో కాస్త తగ్గిన భక్తుల రద్దీ.. మరోసారి పెరిగింది. గత రెండు రోజులుగా తిరుమలకు భక్తుల తాకిడి కొనసాగుతూనే ఉంది. దీంతో తిరుమలలో 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టోకెన్ లేని భక్తులుకు శ్రీవారి సర్వదర్శనానికి(Shri Vari Sarvadarshan)కి 20 గంటల సమయం పడుతుంది. నిన్న(గురువారం) శ్రీవారిని 64,983 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 25,324 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకోగా.. రూ.3.49 కోట్ల హుండీ ఆదాయం(Hundi income) వచ్చినట్లు టీటీడీ అధికారులు చెప్పుకొచ్చారు.