ఏపీలో కాంగ్రెస్‌కి పూర్వ వైభవం
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యుడు తులసిరెడ్డి చెప్పారు.....
దిశ, తిరుపతి: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యుడు తులసిరెడ్డి చెప్పారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ పార్లమెంట్ భవన్‌లో దుండగులు దాడి చేయడంపై ఆయన తీవ్రంగా విమర్శించారు. పార్లమెంటును భద్రత కల్పించలేని మోడీ ప్రభుత్వం సరిహద్దుల్లో భారతదేశ సంరక్షణ ఎలా చేస్తుందని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై నరేంద్ర మోడీ, అమిత్ షాలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో అంగన్వాడీ సమస్యలు పరిష్కరిస్తారని హామీలు ఇచ్చారని, అయితే అధికారంలోకి రాగానే వారిని నట్టేట ముంచారని విమర్శించారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంలో అంగన్వాడీ వర్కర్లకు 13,500 హెల్పర్‌కు 7500 ఇచ్చే వారిని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అంగన్వాడి వర్కర్లకు 18000 హెల్పర్లకు 10,500 ఇస్తున్నారు. అయితే రాష్ట్రంలో అంగన్వాడి వర్కర్లకు రూ.11,500 తెలిపారు. రానున్న ఎన్నికలలో మహిళలు కన్నీటి వరదలు వైఎస్సార్ ప్రభుత్వం కొట్టుకుపోతుందన్నారు.
రాష్ట్రంలో త్వరలో భారీ స్థాయిలో విశాఖ, రాజమండ్రి, తిరుపతి, కడపలో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నామని, ఈ బహిరంగ సభకు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ వస్తారని తెలిపారు. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల ఫలితాలు మాదిరిగానే ఏపీలోనూ కాంగ్రెస్‌కి అత్యధిక మెజార్టీ రాగలగే సూచనలు ఉన్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిందని తెలిపారు. అలాగే రాష్ట్రంలో కూడా పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన వెల్లడించారు.