గందరగోళంగా పోలవరం సీటు.. తెరపైకి కొత్త ముచ్చట.. షాక్ లో కార్యకర్తలు

ఎస్టీ నియోజకవర్గమైన పోలవరం భౌగోళికంగా కీలకమైనది.

Update: 2024-03-21 10:37 GMT
గందరగోళంగా పోలవరం సీటు.. తెరపైకి కొత్త ముచ్చట.. షాక్ లో కార్యకర్తలు
  • whatsapp icon

దిశ వెబ్ డెస్క్: ఎస్టీ నియోజకవర్గమైన పోలవరం భౌగోళికంగా కీలకమైనది. దీనితో పోలవరం నియోకవర్గం నుండి టీడీపీ తరుపున బరిలో దిగనున్న అభ్యర్థి ఎవరు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో ఇప్పటికే 14 నియోజకవర్గాలకి అభ్యర్థులను మిత్రపక్ష పార్టీలు ప్రకటించాయి.

అయితే పోలవరంలో మాత్రం మిత్రపక్షాలు నేటికీ అబిభ్యర్థిని ప్రకటించలేదు. దీనితో పోలవరం సీటు ఎవరికి ఇస్తారో తెలీక టీడీపీ, జనసేన శ్రేణులు అయోమయంలో పడ్డారు. కాగా 2019 ఎన్నికల్లో పోలవరం నుండి బొరగం శ్రీనివాసులు టీడీపీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినా ఆయన గత ఐదేళ్లుగా పార్టీ క్యాడర్ ను కాపాడుకుంటూ వస్తున్నారు.

ఇక జిల్లాలోని 7 మండలాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు శ్రీనివాసులు తెచ్చుకున్నారు. ఇక జనసేన నుండి బాలరాజు గత ఎన్నికల్లో పోటీ చేశారు. ఇక గత ఐదేళ్లుగా బాలరాజు కూడా జిల్లాలోని గ్రామాల్లో పార్టీని బలోపితం చేశారు. అయితే బీజేపీ, జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం, ఇక జనసేన పోలవరం సీటును కోరడం, అందుకు టీడీపీ అధిష్టానం కూడా సమ్మతించింది అనే వార్తలు వెల్లువెత్తడంతో టీడీపీ నేతలు ఉల్లిక్కిపడ్డారు.

ఉన్నపలంగా అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఇక పార్టీ కోసం పని చేసిన బొరగం శ్రీనివాసులుకు పార్టీ టికెట్ ఇవ్వాలని టీడీపీ నేతలు ఏకగ్రీవంగా తీర్మానం చేసారు. ఇక ఓ టీడీపీ కార్యకర్త అయితే బొరగం శ్రీనివాసులుకు పార్టీ టికెట్ ఇవ్వాలని ఆత్మహత్యాయత్నం చేశారు.

ఇక జనసేన మాత్రం సీటు తమకే అని.. ఇక జనసేన తరుపున బాలరాజు బరిలో ఉంటారనే ధీమాతో మౌనం వహించింది. అయితే ఎవరు ఊహించని రీతిలో జనసేన నుండి టీడీపీ నేత మొడియం సూర్యచంద్రరావుని పోలవరం నుండి ఎన్నికల బరిలో దించుతారనే ప్రచారం జోరందుకుంది.

దీనితో అటు టీడీపీ, ఇటు జనసేన నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇక ఈ ప్రచారంతో ఐవీఆర్ ఎస్ సర్వే సంస్థకు కొత్త తలనొప్పి మొదలైంది. ఇక ఈఐవీఆర్ ఎస్ సర్వేలో సూర్యచంద్రరావు పేరుతో పాటుగా మరో మహిళ పేరు కూడా వచ్చింది. దీనితో తెరవెనక అసలు ఏం జరుగుతుందో తెలీక ఇరు పార్టీల్లో గందరగోళం నెలకొంది.

టీడీపీ, జనసేనలో కష్టపడిన నేతల పేర్లు కాకుండా కొత్తవారి పేర్లు రావడంతో.. ఆశలు వాళ్ళు పార్టీకోసం ఎప్పుడు పని చేశారు అని ఇరు పార్టీల కార్యకర్తలు ఆశ్చర్యపోతున్నారు. ఇక పోలవరం టికెట్ బీజేపీకా, లేక టీడీపీకా అనే చర్చను వదిలేసి.. టికెట్ కొత్తవారికా.. పాతవారికా అనే చర్చమొదలైంది. 

Tags:    

Similar News