అదేగాని జరిగితే పథకాలన్నీ కట్.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే తాము ప్రవేశ పెట్టిన పథకాలు కట్ చేస్తారని సీఎం జగన్ అన్నారు. ...

Update: 2024-04-07 12:21 GMT
అదేగాని జరిగితే పథకాలన్నీ కట్.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే తాము ప్రవేశ పెట్టిన పథకాలు కట్ చేస్తారని సీఎం జగన్ అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం కొనకమిట్లలో మేమంతా సిద్ధం భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఈ ఎన్నికలు చంద్రబాబు, జగన్ మధ్య జరగుతున్నవి కావని చెప్పారు. ప్రజలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరుతున్న ఎన్నికలు అని తెలిపారు. ప్రజల ఎజెండాతో తాము ఎన్నికలకు వెళ్తున్నామని జగన్ పేర్కొన్నారు. కానీ జెండాలు జతకట్టి వాళ్లు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజల అడుగులు ముందుకా.. వెనక్కా అనే విషయాలపై జరుగుతున్న ఎన్నికలు అని చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం తాము పని చేస్తుంటే రాజకీయాల కోసం ప్రత్యర్థులు పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎప్పుడూ అడ్డదారిలోనే వస్తారని సీఎం జగన్ విమర్శించారు. 

Tags:    

Similar News