ఏపీలో బచ్చా రాజకీయం.. చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు

తమ సభలకు వస్తున్న స్పందన చూసి కూటమి నేతలు ఓర్వలేకపోతున్నారని.. వైసీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు...

Update: 2024-04-20 11:47 GMT
ఏపీలో బచ్చా రాజకీయం.. చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: తమ సభలకు వస్తున్న స్పందన చూసి కూటమి నేతలు ఓర్వలేకపోతున్నారని.. వైసీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. అనకాపల్లి మేమంతా సిద్ధం సభలో ఆయన ప్రసంగించారు. తనను బచ్చా అన్న చంద్రబాబు వ్యాఖ్యలపై సీఎం జగన్ స్పందించారు. చంద్రబాబును చూస్తుంటే కృష్ణుడిని బచ్చా అన్న కంసుడు గుర్తుకు వస్తున్నాడని సెటైర్లు వేశారు.. తనను బచ్చా అన్న వ్యక్తి పది మందిని వెంటవేసుకు వస్తున్నాడని ఎద్దేవా చేశారు. బాణాలు, రాళ్లు, ఆయుధాలు పట్టుకుని నన్ను చుట్టుముట్టారని వ్యాఖ్యానించారు. కానీ తాను మాత్రం ఒంటరిగా పోటీ చేస్తున్నానని కౌంటర్ ఇచ్చారు. ఎక్కడిని ఎదుర్కోవడానికి నక్కలన్నీ ఒక్కటయ్యాయని విమర్శించారు. తాను బచ్చా అయితే తన చేతిలో ఓడిపోయిన తమర్ని ఏమనాలని సీఎం జగన్ ప్రశ్నించారు. ఈ బచ్చా చేసిన పనులు తమరెందుకు చేయలేకపోయారని సీఎం జగన్ నిలదీశారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షే పథకాల ద్వారా రూ.2.70 లక్షల కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. ఎలాంటి వివక్షకు తావు లేకుండా ప్రతి కుటుంబానికి పథకాలు అందజేశామని సీఎం జగన్ పేర్కొన్నారు. స్వయం ఉపాధి, రైతు భరోసా అందజేశామని గుర్తు చేశారు. తాము అందించిన సంక్షేమ పథకాలు గతంలో అమలయ్యాయా అని సీఎం జగన్ ప్రశ్నించారు.

Tags:    

Similar News