ఏప్రిల్ వరకు డెడ్ లైన్.. 32 మంది ఎమ్మెల్యేలకు CM జగన్ సీరియస్ వార్నింగ్

ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో వెనుకబడ్డ 32 మంది ఎమ్మెల్యేలకు జగన్ సీరియస్‌ వార్నింగ్ ఇచ్చారు.

Update: 2022-12-16 10:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో వెనుకబడ్డ 32 మంది ఎమ్మెల్యేలకు సీఎం జగన్ సీరియస్‌ వార్నింగ్ ఇచ్చారు. ఏప్రిల్ వరకు డెడ్ లైన్ ఇస్తున్నానని.. తీరు మార్చుకోకపోతే వేటు తప్పదని ఎమ్మెల్యేలను హెచ్చరించారు. ఇకపై ఆ 32 మంది ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాలని ఆదేశించారు. అయిన పనితీరు మార్చుకుంటే వచ్చే ఎన్నికల్లో వారి స్థానాల్లో కొత్త అభ్యర్థులను బరిలోకి దింపుతానని జగన్ ఖరాకండిగా తేల్చి చెప్పారు. ప్రజా సమస్యలపై సీరియస్‌గా వ్యవహరించాలని.. ఇకపై ఆషామాషీగా తీసుకుంటే కుదరదని హెచ్చరించారు.

మళ్లీ 2023 మార్చిలో గడపగడపకు మన ప్రభుత్వం వర్క్ షాప్ నిర్వహిస్తామని.. అప్పటిలోగా పనితీరు మార్చుకోకుంటే రాబోయే ఎన్నికల్లో వేటు తప్పదని స్పష్టం చేశారు. వచ్చే వర్క్ షాష్‌లోనే ఎమ్మెల్యేల జాబితా వెల్లడిస్తానని.. ఈ వంద రోజులు మనకు చాలా ముఖ్యమని జగన్ పేర్కొన్నారు. కాగా, పనితీరు బాగోలేదని సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చిన 32 మంది ఎమ్మెల్యేల్లో 7 గురు మంత్రులు ఉన్నట్లు సమాచారం. విడదల రజినీ, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్, గుమ్మనూరు జయరాం, అంబటి రాంబాబు, సీదిరి అప్పలరాజుల పనితీరుపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 

ఇవి కూడా చదవండి : 

32 మంది పనితీరుపై Jagan సీరియస్.. ఆ విషయంలో వార్నింగ్


Similar News