AP News:‘ఈ ఏడాదే ఆ రెండు పథకాలు ప్రారంభిస్తాం’.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్రాభివృద్ధే(State Development) లక్ష్యంగా అడుగులు వేస్తోంది.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్రాభివృద్ధే(State Development) లక్ష్యంగా అడుగులు వేస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది నెలల్లో సీఎం చంద్రబాబు(CM Chandrababu) పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల పై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఇవాళ(శుక్రవారం) టీడీపీ పొలిట్ బ్యూరో(TDP Polit Buro) భేటీలో కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్డీయే కూటమి ఎన్నికల సమయంలో తల్లికి వందనం( విద్యార్థికి రూ.15000), అన్నదాత సుఖీభవ(రైతుకు రూ.20,000) పథకాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకాల(Government Schemes) అమలుపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ ఏడాదే(2025) తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు టీడీపీ పొలిట్ బ్యూరో భేటీలో ప్రకటించారు.
ఈ క్రమంలో అన్నదాత-సుఖీభవ పథకాన్ని(Annadata-Sukhibhava scheme) మూడు విడతల్లో చెల్లిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఆదాయం(Income) పెంచే మార్గాలు వెతుకుతున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గోదావరి నీళ్లు(Godavari Water) రాయలసీమ(Rayalaseema)కు తరలించేలా చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టు(Banakacharla Project)ను ప్రభుత్వం, కాంట్రాక్టర్లు భరించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ తరుణంలో సూపర్ సిక్స్ పథకాల పై వస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మొద్దని సూచించారు.