AP Volunteer:సీఎం చంద్రబాబుకు బిగ్ షాక్..వాలంటీర్లు సంచలన నిర్ణయం

ఏపీలో ఎన్డీయే కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టారు.

Update: 2024-08-22 12:50 GMT
AP Volunteer:సీఎం చంద్రబాబుకు బిగ్ షాక్..వాలంటీర్లు సంచలన నిర్ణయం
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టారు. గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వలంటీర్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందా? లేదా? అనే విషయం పై కూడా రాష్ట్రంలో చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఏపీ వలంటీర్లు ఏపీ ప్రభుత్వానికి బిగ్ షాక్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..ఉద్యోగ భద్రతపై ఆందోళనలో ఉన్న గ్రామ, వార్డు వలంటీర్లు ఉద్యమానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. పెండింగ్ బకాయిలతో పాటు ఎన్నికల్లో హామీ ఇచ్చిన రూ.10,000 గౌరవ వేతనం అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గౌరవ వేతనం లేకపోవడం వల్ల వారు తీవ్రంగా నష్టపోయామని భావిస్తున్నట్లు వాపోయారు. ఈ మేరకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని లేదంటే ఉద్యమానికి శ్రీకారం చూడతామని హెచ్చరించారు. ఈ నెల 27న జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోకపోతే ఈ నెల 31న విజయవాడలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి ఉద్యమ ప్రణాళిక రూపొందించాలని భావిస్తున్నారు.

Tags:    

Similar News