‘యాక్షన్ స్టార్ట్’.. ఫస్ట్ భేటీలోనే IAS, IPS ఆఫీసర్లకు సీఎం చంద్రబాబు స్వీట్ వార్నింగ్..!

ఆంధ్రప్రదేశ్‌కు నాలుగో సారి ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు.

Update: 2024-06-13 14:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌కు నాలుగో సారి ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే బాబు తనదైన శైలీలో యాక్షన్ మొదలుపెట్టారు. సీఎం హోదాలో ఇవాళ ఫస్ట్ టైమ్ సెక్రటేరియట్‌కు వెళ్లిన చంద్రబాబు.. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలోని ఐదేళ్లలో కొందరు అధికారుల తీరు నన్ను తీవ్రంగా బాధించిందని అన్నారు. ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు ఇలా వ్యవహరిస్తారని ఎప్పుడూ అనుకోలేదన్నారు. ఇకనైనా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఆత్మ సమీక్ష చేసుకోవాలని ఫస్ట్ భేటీలోనే స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

మరోసారి శాఖల వారీగా అందరితో సమావేశమవుతానని అధికారులకు బాబు స్పష్టం చేశారు. కాగా, గత ప్రభుత్వ హయాంలో కొందరు అధికారులు వైసీపీ తొత్తుల్లా వ్యవహరించి చంద్రబాబు, టీడీపీ నేతలను తీవ్ర ఇబ్బందులు పెట్టినట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ ఓటమితో అ అధికారుల్లో టెన్షన్ స్టార్ట్ అయ్యింది. ఈ సమయంలోనే చంద్రబాబు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్‌తో భేటీ అయ్యి.. ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించడం హాట్ టాపిక్‌గా మారింది. గత ప్రభుత్వ అండ చూసుకుని రెచ్చిపోయిన అధికారులపై చంద్రబాబు యాక్షన్ తీసుకుంటారా..? ఒక వేళ తీసుకుంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 


Similar News