నేటి నుంచి ప్రజా పాలన మొదలైంది.. తిరుపతి నుండి ప్రక్షాళన మొదలు: సీఎం చంద్రబాబు

2024 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించి బుధవారం చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

Update: 2024-06-13 05:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించి బుధవారం చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వెంటనే తిరుమల తిరుపతికి కుటుంబ సమేతంగా వచ్చిన సీఎం చంద్రబాబు.. గురువారం తెల్లవారుజామున శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన అక్కడే ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. తమది దేశ చరిత్రలోనే చరిత్రత్మక విజయమని.. 93 శాతం స్ట్రైక్ రేటుతో అధికారంలోకి వచ్చామని.. ఈ క్రమంలోనే శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నానని బాబు తెలిపారు. అలాగే గతంలో అలిపిరిలో తనపై జరిగిన దాడిలో నన్ను వెంకటేశ్వర స్వామి బతికించారని గుర్తు చేసుకున్నారు. ఏ పని చేసినా వెంకన్న సంకల్పంతోనే చేస్తానని.. తాను రాష్ట్రానికి ఇంకా ఏదో చేయాల్సి ఉంది కాబట్టే ఆ రోజు నన్ను దేవుడు కాపాడారని అన్నారు. ఏపీ రాష్ట్రం మొత్తం శ్రీవారి ఆశీస్సులతో సుభిక్షంగా ఉండాలని మొక్కుకున్నట్లు తెలిపారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో ఆ సంపద పేదవారికి వెళ్లడం కూడా అంతే ముఖ్యమని సీఎం అన్నారు. గత ఐదు సంవత్సరాలలో రాష్ట్రానికి అపార నష్టం జరిగిందని.. దానిని గాడిలో పెట్టి.. పేదరికం లేని రాష్ట్రంగా ఏపీ ని మారుస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే నేటి నుంచే ప్రజా పాలన మొదలైందని.. తిరుపతి నుంచి ప్రక్షాలణ మొదలు పెడతామని అన్నారు. ఇందులో భాగంగా తిరుపతి కొండను పూర్తిగా ప్రక్షాలన చేస్తామని.. తిరుమలలో ఓ నమో వేంకటేశాయ తప్ప వేరే నినాదం వినిపించోద్దని సీఎం అన్నారు.  ఈ రోజు సాయంత్రం 4.15 నిమిషాలకు ఆయన సీఎంగా బాధ్యతలు తీసుకోనున్నారు.


Similar News