ఆ పని చేయొద్దు.. యువతకు సీఎం చంద్రబాబు కీలక సందేశం
అనంతపురం జిల్లా నేమకల్లు నుంచి యువతకు సీఎం చంద్రబాబు కీలక సందేశం ఇచ్చారు..
దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా నేమకల్లు( Anantapur District Nemakallu)లో సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu) పర్యటించారు. పింఛన్ లబ్ధిదారుల ఇంటికి వెళ్లి డబ్బులను అందజేశారు. ఈ సందర్బంగా గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజా వేదిక కార్యక్రమం నుంచి యువతకు చంద్రబాబు కీలక సందేశం ఇచ్చారు. యువత(Youth) ఎక్కువగా సెల్ ఫోన్ చూస్తోందని, దాని వల్ల సమయం వృథా అవుతోందని, అలాంటి పనులు మానుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. చదువుకున్న యువతే రాష్ట్రానికి పెద్ద ఆస్తి అని పేర్కొన్నారు. యువత కష్టపడి పని చేయాలని అప్పుడే గౌరవం ఉంటుందని తెలిపారు. రాష్ట్రానికి కంపెనీలు వస్తే 4 లక్షల మంది యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. ఎన్ని ఉద్యోగాలు ఇస్తే అన్ని రాయితీలు ఇస్తామని కంపెనీలకు చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఐదు నెలల్లోనే రాష్ట్రానికి రూ. 4 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.
విజన్‌తో పని చేయడం వల్లే దేశంలోనే హైదరాబాద్(Hyderabad) నెంబర్‌వన్‌గా తయారైందన్నారు. 2047 నాటికి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) నెంబర్ వన్ రాష్ట్రంగా మారాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ప్రపంచాన్ని శాసించే శక్తియుక్తులు మన పిల్లలకున్నాయన్నారు. పిల్లలను బాగా చదివించాలని, వారిలో నైపుణ్యాలను పెంపొందించాలని సూచించారు. లోకల్ బాడీ ఎన్నికల్లో(Local Body Elections) పిల్లల నియంత్రణ చట్టం తీసేశామని చంద్రబాబు తెలిపారు.