నాగబాబుకు కీలక పదవి.. పవన్ కల్యాణ్ మనసులో ఉంది అదేనా?

ఏపీలో ఇటీవల మోపిదేవి వెంకటరమణ, మస్తాన్‌రావు, కృష్ణయ్య రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేయడంతో ఖాళీ అయిన 3 సీట్లు ఎన్డీయేకే దక్కనున్నాయి.

Update: 2024-09-29 14:31 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఇటీవల మోపిదేవి వెంకటరమణ, మస్తాన్‌రావు, కృష్ణయ్య రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేయడంతో ఖాళీ అయిన 3 సీట్లు ఎన్డీయేకే దక్కనున్నాయి. వీటిలో రెండు టీడీపీ, ఒకటి జనసేన పంచుకుంటాయని వార్తలు వస్తున్నాయి. బీజేపీ అధిష్ఠానం తమకూ ఓ సీటూ అడగొచ్చని సమాచారం. టీడీపీ నుంచి అశోక్ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమ పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా, జనసేన నుంచి నాగబాబు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో చురుకుగా ప్రచారంలో పాల్గొనడంతో పాటు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రచార బాధ్యతలు నాగబాబు తన భుజాన వేసుకున్నారు.

నాగబాబు ఎన్నికల్లో పోటీ చేద్దామని భావించినప్పటికీ పొత్తుల కారణంగా ఆయనకు అవకాశం దక్కనప్పటికీ నిరుత్సాహపడలేదు. కూటమి గెలుపు కోసం కష్టపడ్డారు. దీంతో జనసేన నుంచి రాజ్యసభ రేసులో నాగబాబు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నాగబాబును రాజ్యసభ్యుడిగా ప్రతిపాదిస్తే పార్టీలో వ్యతిరేకత ఉండకపోవచ్చు. నామినేటెడ్ పదవులకంటే రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇస్తే నాగబాబుకు సరైన గౌరవం ఇచ్చినట్లుగా ఉంటుందనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశం పై డిప్యూటీ సీఎం పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


Similar News