Tirumala: అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత కలకలం

తిరుమల అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం కలకలం రేగింది...

Update: 2025-02-13 16:21 GMT
Tirumala: అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత కలకలం
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: తిరుమల అలిపిరి నడకమార్గం(Tirumala Alipiri Walkway)లో చిరుత(Cheetah) సంచారం కలకలం రేగింది. 7వ మలుపు వద్ద నడకదారి భక్తుల(Devotees)కు చిరుత కనిపించింది. దీంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. అటవీ శాఖ అధికారుల(Forest Department officials)కు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లిన అటవీ శాఖ అధికారులు... చిరుత ఆనవాళ్లను గుర్తిస్తున్నారు. మరోవైపు చిరుత కదలికల పట్ల భక్తులను టీటీడీ(TTD) అధికారులు అప్రమత్తం చేశారు. చీకటి సమయంలో ఒంటరిగా తిరగొద్దని సూచించారు. ఎటు వెళ్లినా గుంపులుగా వెళ్లాలన్నారు. త్వరగా చిరుతను గుర్తించాలని అటవీ శాఖ అధికారులను కోరారు.

Tags:    

Similar News