Ap News: జగన్ పాలనకు అంతిమ ఘడియలు..!

సీఎం జగన్ పాలనకు అంతిమ ఘడియలు దగ్గర పడిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు..

Update: 2024-01-08 17:31 GMT
Ap News: జగన్ పాలనకు అంతిమ ఘడియలు..!
  • whatsapp icon

దిశ, పీలేరు: సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనకు అంతిమ ఘడియలు దగ్గర పడిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం పీలేరులో ‘బాబు షురిటీ భవిష్యత్తుకు గ్యారంటీ’ భాగంగా ఇంటింటి ప్రచారం చేపట్టారు. స్థానిక మైనారిటీ నేత రియాజ్ ఇంట్లో విలేఖరులతో మాట్లాడుతూ జగన్ హయాంలో రాష్ట్రం వందేళ్లు వెనక్కి పోయిందని విమర్శించారు.


ఎమ్మెల్యేలు, ఎంపీలకు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాడంటే, తనపై ఉన్న చెడ్డ పేరును ప్రజలు మరచి పోవటానికి చేస్తున్న జిమ్మిక్కులు అని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు. పీలేరులో వైఎస్సార్ నేతలు లే అవుట్‌లలో వందలాది ప్లాట్లు దోచుకున్నారని విమర్శించారు. లే అవుట్‌లలో ఒక్క ఇల్లు పూర్తి చేశారా అని ప్రశ్నించారు. 24న పీలేరులో జరుగు ‘రా కదిలి రా’ బహిరంగ సభను విజయవంతం చేయాలని కిషోర్ కుమార్ రెడ్డి కోరారు.

Tags:    

Similar News