ఆందోళనకరంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి.. సోమవారం మరోసారి పరీక్షలు

సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు....

Update: 2023-01-28 14:05 GMT
ఆందోళనకరంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి.. సోమవారం మరోసారి పరీక్షలు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రికి వెళ్లిన ఆమె తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తారకరత్నకు సోమవారం మరోసారి పరీక్షలు నిర్వహిస్తామని వైద్యులు తెలిపినట్లు ఆమె పేర్కొన్నారు.

ఇక తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉన్నట్లు తెలిపారు. అత్యవసర చికిత్స విభాగంలో వైద్యం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. 

Tags:    

Similar News