ముక్కంటి సేవలో ప్రముఖులు
శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి ఈ రోజు(బుధవారం) కొందరు ప్రముఖులు విచ్చేశారు.

దిశ, శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి ఈ రోజు(బుధవారం) కొందరు ప్రముఖులు విచ్చేశారు. పెనుగొండ క్షేత్రం పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి శిష్యులతో కలిసి ఆలయానికి వచ్చారు. ఆయనకు దేవస్థానం అధికారులు, వేద పండితులు స్వాగతం పలికి స్వామి అమ్మవార్ల దర్శనం చేయించారు. దక్షిణామూర్తి సన్నిధిలో వేదాశీర్వాదం జరిగింది. ఏఈఓ లోకేష్ బాబు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఆయనకు ఆర్య వైశ్య ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు. దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల సలహా మండలి మాజీ సభ్యుడు అయితా మురళీ కృష్ణ, బజార్ వీధి కన్యకా పరమేశ్వరి ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు మురళి, రమేష్ బాబు, భాస్కర్, రమేష్, స్వరూప్ తదితరులు కూడా స్వాగతం పలికారు. సంగీత దర్శకుడు కోటి కుటుంబ సభ్యులతో ఆలయానికి వచ్చారు. స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.