నెల్లూరు నియోజకవర్గంలో వైసీపీ నుంచి కొత్త అభ్యర్థి బరిలోకి?
జీడీ నెల్లూరు నియోజకవర్గంలో మహిళా అభ్యర్థిని బరిలోకి దింపే ఆలోచనలో అధిష్టానం ఉంది. ఇద్దరు మహిళా అభ్యర్థులు రేసులో ఉన్నారు.
దిశ ప్రతినిధి, తిరుపతి: జీడీ నెల్లూరు నియోజకవర్గంలో మహిళా అభ్యర్థిని బరిలోకి దింపే ఆలోచనలో అధిష్టానం ఉంది. ఇద్దరు మహిళా అభ్యర్థులు రేసులో ఉన్నారు. వారిలో పద్మజ రెండు, మూడు దఫాలుగా టికెట్ ఆశిస్తున్నారు. మరొకరు వృత్తిరీత్యా డాక్టర్ అయినా యాగలత బరిలో ఉన్నారు. ఇందులో పద్మజా ప్రభుత్వానికి సలహాదారుగా వ్యవహరిస్తూ జగన్మోహన్ రెడ్డి కి మరియు పెద్దిరెడ్డికి కుడి భుజం గా ఉంటున్నారు.వీరిలో పద్మజా కు అభ్యర్థిత్వం ఇచ్చినట్లయితే అటు రెడ్డి సామాజిక వర్గం, ఇటు దళిత సామాజిక వర్గం ఇరువురు గెలుపు కోసం సహకరిస్తారని అధిష్టానం యొక్క ఆలోచన. మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్న వైసీపీ చిత్తూరు జిల్లాలో మూడు రిజర్వుడ్ స్థానాలు ఉండగా ఇప్పటికే సత్యవేడు, పూతలపట్టు నియోజకవర్గంలో పురుష అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. కావున జీడి నెల్లూరు నియోజకవర్గం లో మహిళకు ఇచ్చే అవకాశం మెండుగా ఉంది.త్వరలో విడుదలయ్యే జాబితాలో ప్రకటించే అవకాశం ఉంది.