పెద్దిరెడ్డికి షాక్.. ఆ గేటు ఓపెన్
తిరుపతిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది...
దిశ, వెబ్ డెస్క్: తిరుపతిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. పెద్దిరెడ్డి ఇంటి ముందున్న రోడ్డులోని గేటును మున్సిపల్ అధికారులు తొలగించారు. ఆ గేటును తొలగించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో రంగంలోకి దిగారు. తన ఇంటి ముందు గేటును ఓపెన్ చేశారు. దీంతో ఆ గేటు నుంచి ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. కాగా సీఎంగా జగన్ ఉన్న సమయంలో పెద్దిరెడ్డి మంత్రిగా పని చేశారు. తిరుపతిలోని పెద్ది రెడ్డి ఇంటి ముందు మున్సిపల్ శాఖ నిధులతో రోడ్డు వేయించారు. అయితే ఆ రోడ్డుకు గేటు ఏర్పాటు చేశారు. దీంతో రాయల్ నగర్ నుంచి ఎమ్మార్ పల్లి సర్కిల్ ద్వారా పద్మావతి యూనివర్సిటీకి వెళ్లడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 2 కిలో మీటర్లు అదనంగా తిరిగి వెళ్లాల్సి వచ్చింది.
ప్రభుత్వం మారడంతో తిరుపతి జనసేన పార్టీ అధ్యక్షుడు కిరణ్ రాయల్ ఆందోళన వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో మున్సిపల్ అధికారులు గేటు తొలగించకపోతే తామే తీసివేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రోడ్డుతో పాటు గేటుకు అయిన వ్యయాన్ని తాను భరిస్తానంటూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి హైకోర్టుకు వెళ్లారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు పెద్దిరెడ్డి షాక్ ఇచ్చింది. వెంటనే ఆ గేటును తొలగించాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు ఆ గేటును తొలగించి పెద్దిరెడ్డికి నోటీసులు జారీ చేశారు.