Gudur: కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం... తప్పిన ప్రమాదం

తిరుపతి జిల్లా గూడూరులో హోండా షోరూం వద్ద గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు చేసేందుకు పెద్ద గుంత తవ్వి వదిలేశారు. ....

Update: 2023-06-18 15:55 GMT

దిశ, గూడూరు: తిరుపతి జిల్లా గూడూరులో హోండా షోరూం వద్ద గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు చేసేందుకు పెద్ద గుంత తవ్వి వదిలేశారు. దీంతో ఆ వైపు వెళ్తున్న వారు గుంతలో పడుతున్నారు. బురదలో కూరుకుపోయి నరకయాతన అనుభవిస్తున్నారు. బయటకు రావడానికి నానా అవస్థలు పడుతున్నారు. గూడూరు నుంచి చిల్లకూరు వైపు వెళ్తున్న ఇద్దరు వాహనదారులు ప్రమాదవశాత్తు గుంతలో పడి కూరుకుపోయారు. బయటకు రావడం వీలు కాక నరక యాతన అనుభవించారు. అయితే వారిని అటుగా వెళుతున్న పలువురు రక్షించి గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కాగా గూడూరులో గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు చేసే క్రమంలో రోడ్లను ధ్వంసం చేస్తూ గుంతలు తవ్వుతున్నారు. అంతేకాదు వాటికి మరమ్మత్తులు చేయకుండా అలానే వదిలేస్తున్నారు. కొన్ని చోట్ల తుతూ మంత్రంగా మట్టిని కప్పేసి చేతులు దులుపుకుంటున్నారు. గతంలో వాటర్ పైప్ లైన్లు పగిలి నీరు కలుషితంగా మారింది. దీనంతటికీ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్యాస్ పైప్ లైన్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Tags:    

Similar News