Chittoor: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి

చిత్తూరు జిల్లా సదుం మండలం గంటావారిపల్లెలో ఏనుగు మృతి చెందింది...

Update: 2023-11-08 04:37 GMT
Chittoor: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా సదుం మండలం గంటావారిపల్లెలో ఏనుగు మృతి చెందింది. పొలానికి అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ఏనుగు అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఘటన రాత్రి సమయంలో జరిగింది. పొలాలను అడవి జంతువుల నుంచి కాపాడుకునేందుకు ఓ రైతు విద్యుత్ వైర్లు ఏర్పాటు చేశారు. అయితే ఆ వైర్లకు తగిలి ఏనుగు మృత్యువాత పడింది. స్థానికుల సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఏనుగు మృతి కారణాలు తెలుసుకున్నారు. ఏనుగు పంచనామాకు ఏర్పాటు చేశారు. ఏనుగు మృతిపై కేసు నమోదు చేస్తున్నారు. అయితే స్థానిక అటవీ ప్రాంతంలో మరిన్ని ఏనుగులు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు అటవీ జంతువులు తరచూ తమ పొలాలను నాశనం చేస్తున్నాయని, ఏనుగులు రాకుండా అటవీ శాఖ అధికారులు సరైన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.


Similar News