ఒంగోలు రాజకీయాల్లో అనూహ్య పరిణామం.. కలిసిపోయిన బాలినేని, చెవిరెడ్డి

చంద్రగిరి ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంట్ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే బాలినేని కలిసిపోయారు...

Update: 2024-02-14 10:52 GMT
ఒంగోలు రాజకీయాల్లో అనూహ్య పరిణామం.. కలిసిపోయిన బాలినేని, చెవిరెడ్డి
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: చంద్రగిరి ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంట్ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే బాలినేని కలిసిపోయారు. ఒంగోలు ఎంపీ టికెట్ మళ్లీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి బాలినేని తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం సమన్వయకర్తగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సీఎం జగన్ నియమించారు. దీంతో చెవిరెడ్డి, బాలినేని మధ్య విభేదాలు తలెత్తినట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి తాజాగా పటాపంచలు చేశారు. ఒంగోలులో చెవిరెడ్డి, బాలినేని భేటీ అయ్యారు. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని చెవిరెడ్డికి వివరించారు. అనంతరం ఇద్దరూ కలిసి దర్శి వెళ్లారు. వైసీపీ ఇంచార్జి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో కలిసి వైసీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు.

ఈ సందర్బంగా బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దర్శి వైసీపీలో ఉన్న విభేదాలను పక్కట పెట్టాలని సూచించారు. దర్శి ఇంచార్జి బూచేపల్లి ప్రసాద్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ రెడ్డి మధ్య విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో బాలినేని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్శి వైసీపీ నేతలు విభేదాలు వీడాలని సూచించారు. విభేదాలు పక్కన పెట్టి శివప్రసాద్ రెడ్డిని గెలిపించాలని పిలుపు నిచ్చారు. లోటు పాట్లను సరిదిద్దుకుందామని చెప్పారు. వైసీపీ నేతలందరూ సమన్వయంతో కలిసి పని చేయాలని బాలినేని సూచించారు.

Tags:    

Similar News