బ్రేకింగ్: మరోసారి చంద్రబాబు రిమాండ్ పొడగింపు.. అప్పటి వరకు జైలులోనే మాజీ CM..!
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత, ఏపీ మాజీ చంద్రబాబు రిమాండ్‌ను ఏసీబీ కోర్టు
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు రిమాండ్‌ను ఏసీబీ కోర్టు మరోసారి పొడగించింది. చంద్రబాబుకు మరో 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఈ నెల 19వ తేదీ వరకు బాబు రాజమండ్రి సెంట్రల్ జైలులోనే ఉండనున్నారు. కాగా, చంద్రబాబుకు విధించిన జ్యుడిషియల్ రిమాండ్ ఇవాళ్టితో ముగియనుంది. ఈ నేపథ్యంలో అధికారులు ఆయనను వర్చువల్‌గా జడ్జి ముందు ప్రవేశపెట్టారు. అనంతరం ఏసీబీ కోర్టు జడ్జి బాబుకు మరో 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు.
ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్‌లో భాగంగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఇదిలా ఉండగా, చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. ఇవాళ ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ రెండు పిటిషన్లపై విచారణను రేపటికి వాయిదా వేశారు. చంద్రబాబు తరుఫున ప్రమోద్ కుమార్ వాదనలు వినిపించగా.. సీఐడీ తరుఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ వాదించారు. కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడటంతో తెలుగు తమ్ముళ్లలో ఉత్కంఠ నెలకొంది.