AP:ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండా..చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం?

రాష్ట్రంలో ఎన్డీయే కూటమి నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో ఏపీలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

Update: 2024-06-24 07:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో ఏపీలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే రాష్ట్రాభివృద్ధిపై దృష్టి సారించిన చంద్రబాబు సర్కార్ ఇప్పుడు ప్రజా సంక్షేమం పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మంగళగిరిలో తన నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రజా దర్బార్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ వెబ్ పోర్టల్‌ను సోమవారం (జూన్ 24) ఉదయం 9 గంటల నుంచి ప్రారంభిస్తోంది. జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్లలో, మున్సిపల్ కార్యాలయాల్లో, మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయంలో సంబంధిత అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. అర్జీలను ఇచ్చేందుకు తప్పనిసరిగా ఆధార్, ఫోన్ నెంబర్ ఇవ్వాలి. దరఖాస్తును ఆన్‌లైన్‌లో నమోదు చేసి సంఖ్య కేటాయిస్తారు.

Read More..

పెన్షన్ దారులకు గుడ్ న్యూస్... జులై 1న రూ. 7000 అందుకోనున్న పెన్షనర్లు

Tags:    

Similar News