ఆ రోజు బిల్ గేట్స్‌తో అదే చెప్పా: సీక్రెట్ రివీల్ చేసిన చంద్రబాబు
హైదరాబాద్‌లో హైటెక్ సిటీ నిర్మాణం తర్వాత ఐటీ రంగం పురోగమించిందని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో హైటెక్ సిటీ నిర్మాణం తర్వాత ఐటీ రంగం పురోగమించిందని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) విద్యార్థులతో బాబు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైటెక్ సిటీ నిర్మాణం తర్వాత హైదరాబాద్‌కు చాలా కంపెనీలు వచ్చాయని వెల్లడించారు. హైదరాబాద్‌లో ఐటీ డెవలెప్ మెంట్ కోసం మెక్రోసాప్ట్ తీసుకొచ్చానని.. నగరంలో మెక్రోసాప్ట్ డెవలెప్ మెంట్ సెంటర్ స్థాపించానని తెలిపారు. అప్పట్లో విజన్ 2020 అన్నప్పుడు చాలా మంది ఎగతాళి చేశారని.. కానీ నేడు విజన్ 2020 కల సాకారమైందని చంద్రబాబు సంతోషించారు.
విజన్ 2020 లక్ష్యంతో ప్రారంభించిన సంస్థలు నేడు ఉజ్వలంగా ఉన్నాయని చెప్పారు. నేడు హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి సంస్థలు ఎన్నో ఆవిర్భవించాయని పేర్కొ్న్నారు. హైదరాబాద్‌కు మెక్రోసాప్ట్‌ను తీసుకురావడం కోసం.. బిల్ గేట్స్‌ను 10 నిమిషాలు అపాయింట్ మెంట్ కోరి.. 45 నిమిషాల పాటు చర్చించిన సంగతి గుర్తు చేశారు. గణితం, ఇంగ్లీష్ కలిస్తేనే ఐటీ అని.. ఈ విషయాన్నే బిల్ గేట్స్‌కు చెప్పానని.. ఆయనతో మాట్లాడిన సంబాషణను బాబు రివీల్ చేశారు. మన ఇండియన్స్ స్వతహాగా గణితంలో ప్రతిభావంతులు అని ప్రశంసించారు. భారతీయ యువత చాలా శక్తివంతమైనదని కొనియాడారు.