కేంద్రం గుడ్ న్యూస్.. ఏపీకి రెండు స్మార్ట్ సిటీస్ కేటాయింపు
ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ తెలిపింది....
దిశ, వెబ్ డెస్క్: ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ తెలిపింది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుకు రూ. 12,500 కోట్లు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మోడీ కేబినెట్ తాజాగా మరో వరం ప్రకటించింది. రాష్ట్రంలో రెండు ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా 12 గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీస్ ఏర్పాటు చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఇందులో ఏపీకి -2, తెలంగాణ -1 కేటాయించింది.
కాగా కేంద్రంలో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం కావడంతో రాష్ట్రానికి వరాల జల్లు కురుస్తోంది. పోలవరం ప్రాజెక్టుతో పాటు అమరావతి నిర్మాణానికి సాయం చేసేందుకు ఇప్పటికే కేంద్రం ముందుకు వచ్చింది. అలాగే వెనుక బడిన జిల్లాలకు సైతం ప్రత్యేక ప్రాకేజీ ప్రకటించింది. రాష్ట్ర విభజన హామీలపైనా కేంద్రం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో ఒక్కొక్కటిగా రాష్ట్ర సమస్యలు పరిష్కారం అవడంతో వారి కృషిపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ ఐదేళ్ల పాటు ఇలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నింటిని త్వరగా విడుదల చేయాలని కూటమి నేతలు కోరుతున్నారు.