బీజేపీ కీలక నిర్ణయం.. ఢిల్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌తో ప్రచారం??

దేశరాజధాని ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతుంది.

Update: 2025-01-31 15:20 GMT
బీజేపీ కీలక నిర్ణయం.. ఢిల్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌తో ప్రచారం??
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: దేశరాజధాని ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటే లక్ష్యంగా బీజేపీ(BJP) ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారాన్ని స్పీడ్ చేసిన ఆ పార్టీ.. అధికార ఆప్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ.. ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడిక్కడ ఎండగడుతూ ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో అవలంభించిన విజయ ఫార్ములను బీజేపీ మరోసారి ప్రయోగించేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా మహారాష్ట్ర ఎన్నికల్లో మాస్టర్ ప్లాన్ ను ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi Assembly Elections) అమలు చేసేందుకు సిద్ధం అయింది. చాకచక్యంగా ఎన్డీయే కూటమి (NDA alliance) లోని కీలక నేతలను ఎన్నికల ప్రచారం (Election campaign)లోకి దించి పలు ప్రాంతాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఇందులో భాగంగానే.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) చరిష్మా ను వాడుకునేందుకు ఆ పార్టీ సిద్ధమైంది. ఢిల్లీ అసెంబ్లీలోని పలు నియోజకవర్గాల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడుకు చెందిన ఓట్లు భారీ సంఖ్యలో నివసిస్తున్నారు. దీంతో వారి ఓట్లను రాబట్టుకునేందుకు పవన్ కల్యాణ్ ను ఎన్నికల ప్రచారంలోకి దించేందుకు బీజేపీ సిద్ధం అయింది. ఇందులో భాగంగానే ఇప్పటికే పవన్ కల్యాణ్ ప్రచారం(Pawan Kalyan campaign) చేయాల్సిన నియోజకవర్గాలకు సంబంధించి రోడ్ మ్యాప్ ను సైతం బీజేపీ సిద్ధం చేసింది.

ఇందుకు సంబంధించిన వివరాలను సైతం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)కు అందించగా ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. కానీ ఏ ఏ ప్రాంతాలు, తేదీల్లో పవన్ ప్రచారం చేస్తారనే వార్తలపై ఎటువంటి క్లారిటీ రాలేదు. ఏది ఏమైనప్పటికి గత కొద్ది రోజులుగా పవన్ కల్యాణ్ 100 శాతం స్ట్రైక్ రేటుతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఢిల్లీలో ఆయన సేవలను బీజేపీ వినియోగించుకుంటుంది. కాగా ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మొత్తం ఒకే దశలో ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి.


Read Also..

Lok Sabha Polls 2024: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎంత ఖర్చు చేసిందంటే? 


Similar News