అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

అమరావతిలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉప సంఘం కీలక నిర్ణయం తీసుకుంది...

Update: 2024-11-29 12:04 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని(Ap Capital)లో సంస్థలకు భూ కేటాయింపుల(Land allocations)పై మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు (Cabinet Subcommittee) కీలక నిర్ణయం తీసుకుl గతంలో ముందుకు వచ్చిన పలు సంస్థలకు అదే ధరకే భూముల కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతంలో భూముల కేటాయించిన అన్ని సంస్థలకు ఇప్పటికే లేఖ రాశామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలో ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించిన సంస్థలను ఏమీ చేయలేమని, అవి డబ్బులు కూడా చెల్లించేశాయని తెలిపారు. నిర్మాణాలు ప్రారంభించకుండా సమయం ముగిసిన సంస్థలుంటే వాళ్లతో మాట్లాడతామని, డేటా తీసుకుంటామన్నారు. పరిశీలన చేసి మంత్రులతో చర్చిస్తామని చెప్పారు. ఆ తర్వాత కేబినెట్ ముందుకు తీసుకొస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.


గతంలో కేటాయించిన భూములకు సేమ్ రేట్ వర్తిస్తుందని మంత్రి నారాయణ వెల్లడించారు. కొత్త సంస్థలకు భూ కేటాయింపుపై ఓ పాలసీ చేసి అప్పుడు ముందుకు వెళ్తామని మంత్రి నారాయణ(Minister Narayana)పేర్కొన్నారు. హోటల్స్, హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ సంస్థలకు భూములు ఏ విధంగా ఇవ్వాలనేదానిపై ఓ పాలసీని తీసుకొస్తామని తెలిపారు. రాజధాని ప్రాంతంలో ఈఐఎస్‌ఐ ఆస్పత్రికి 20 ఎకరాలు, బసవతారకం కేన్సర్ ఆస్పత్రికి 15 ఎకరాల భూమిని కేటాయించామని స్పష్టం చేశారు. త్వరలో రాజధాని నిర్మాణాలు చేపడతామని, చాలా సంస్థలు రాష్ట్రానికి వచ్చేందుకు ఉత్సాహం చూపుతున్నాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

Tags:    

Similar News