మరోసారి ప్రమాదంలోకి బెజవాడ.. బుడమేరు వాగుకు పెరుగుతున్న వరద ఉధృతి

నాలుగు రోజుల క్రితం ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా విజయవాడ(vijayawada)లో బుడమేరు వాగు(Budameru river)కు గండిపడి పొంగింది. దీంతో విజయవాడ పట్టణంలో సగానికి పైగా కాలనీలు వరద నీటిలో చిక్కుకున్నాయి.

Update: 2024-09-05 06:40 GMT

దిశ, వెబ్ డెస్క్: నాలుగు రోజుల క్రితం ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా విజయవాడలో బుడమేరు వాగు(Budameru river)కు గండిపడి పొంగింది. దీంతో విజయవాడ పట్టణంలో సగానికి పైగా కాలనీలు వరద నీటిలో చిక్కుకున్నాయి. మూడు రోజులపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా వరదలు(floods) సంభవించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యంత్రాంగం విజయవాడలో బాధితులకు అండగా నిలిచింది. కాగా వరదల నుంచి కోలుకుంటున్న సమయంలో గురువారం తెల్లవారు జామును 1 గంట నుంచి 3 గంటల వరకు భారీ వర్షం కురిసింది. దీంతో బుడమేరు వాగుకు మరోసారి వరద ప్రవాహం(flood level) పెరిగింది. దీంతో పలు కాలనీలు క్రమంగా వదలో చిక్కుకుంటున్నాయి. గంట గంటకు బుడమేరు వాగుకు వరద పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో బుడమేరు వాగుకు పడిన గండ్లను పూడ్చేందుకు అధికార యంత్రం శ్రమిస్తూనే ఉంది. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షం కారణంగా ఈ పనులకు ఆటంకం ఏర్పడుంది. ఈ క్రమంలో మరోసారి వరద పెరుగుతుండటంతో పలు కాలనీలల్లోని ప్రజలు తమ ఇండ్లను ఖాళీ చేసి బంధువుల వద్దకు వెళ్తున్నారు.


Similar News