Breaking News : నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా శరత్ చంద్రారెడ్డి

నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా శరత్ చంద్రారెడ్డిని బరిలోకి దించాలని పార్టీ భావిస్తున్నట్లు తెలిసింది.

Update: 2024-02-28 06:46 GMT
Breaking News : నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా శరత్ చంద్రారెడ్డి
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డిని బరిలోకి దించాలని వైసీపీ భావిస్తున్నట్లు తెలిసింది. అరబిందో ఫార్మాకి డైరెక్టర్‌గా శరత్ చంద్రారెడ్డి ఉన్నారు. వేమిరెడ్డి రాజీనామాతో శరత్ చంద్రారెడ్డిని బరిలో నిలపాలని వైసీపీ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే వైసీపీ హైకమాండ్ శరత్ చంద్రారెడ్డి పోటీపై అఫిషీయల్ అనౌన్స్ చేయనుంది. దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డికి టికెట్ ఇస్తే పార్టీపై ఎలాంటి ప్రభావం చూపుతుందని పొలిటికల్ సర్కిల్ లో చర్చ జోరందుకుంది.

Read More..

Breaking: తాడేపల్లిగూడెం సభకు పోటెత్తిన నాయకులు, కార్యకర్తలు

Tags:    

Similar News