BREAKING: నేను రాజకీయ సన్యాసం తీసుకోవడం లేదు.. ఎమ్మెల్యే వసంత కీలక వ్యాఖ్యలు

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజాకీయాలు హీటెక్కుతున్నాయి.

Update: 2024-02-05 11:35 GMT
BREAKING: నేను రాజకీయ సన్యాసం తీసుకోవడం లేదు.. ఎమ్మెల్యే వసంత కీలక వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజాకీయాలు హీటెక్కుతున్నాయి. రాత్రికి రాత్రే ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ చేస్తూ ఆయా పార్టీల అధినేతలకు షాకిస్తున్నారు. తాజాగా వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లడుతూ.. తాను రాజకీయ సన్యాసం తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రజల ముందు ఉంచుతానని పేర్కొన్నారు. పార్టీ మారే విషయంలో అన్ని వర్గాల వారిని కులుపుకుని ముదుకెళ్తానని తెలిపారు. తనను ఏమాత్రం సంప్రదించకుండానే మైలవరం నియోజకవర్గానికి వైసీపీ అధిష్టానం సమన్వయకర్తను నియమించిందని ఆరోపించారు. అయితే, సీఎం జగన్‌తో తనకు ఎలాంటి వైరం లేదని, కానీ అధికారంలోకి రాగానే ఆయన వైఖరిలో పూర్తిగా మార్పు వచ్చిందని ఆరోపించారు. తన వెంట ఉన్న ముఖ్య నాయకులు, నియోజకవర్గ కార్యకర్తలను సంప్రదించి త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు.

Read More : లోకేశ్, చంద్రబాబుని తిట్టని వాళ్లకి టికెట్లు దక్కవు.. అసంతృప్త ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Tags:    

Similar News