BREAKING: ఒక మంచి వ్యక్తి.. రాంగ్ ప్లేస్‌లో ఉన్నారు: ఎమ్మెల్యే ఆళ్లపై వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు

మంగళగిరి వైసీపీ సమన్వయకర్త బాధ్యతలను పార్టీ అధిష్టానం గంజి చిరంజీవికి ఇవ్వటంతో వైసీపీకి, మంగళగిరి ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు.

Update: 2024-02-23 06:46 GMT
BREAKING: ఒక మంచి వ్యక్తి.. రాంగ్ ప్లేస్‌లో ఉన్నారు: ఎమ్మెల్యే ఆళ్లపై వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: మంగళగిరి వైసీపీ సమన్వయకర్త బాధ్యతలను పార్టీ అధిష్టానం గంజి చిరంజీవికి ఇవ్వటంతో వైసీపీకి, మంగళగిరి ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. అనంతరం జరిగిన పరిణామాలతో ఆయన ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో తాజాగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సొంత గూటికి తిరిగి వచ్చారు. రెండు రోజుల క్రితం విజయసాయిరెడ్డి, తన సోదరుడు అయోధ్యరామిరెడ్డితో ఆయన మంతనాలు జరిపారు.

చర్చలు ఫలించడంతో మళ్లీ ఆళ్ల రామకృష్ణా రెడ్డి సీఎం జగన్ సమక్షంలో మరోసారి వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలో పార్టీ మారిన ఆళ్లపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యల చేశారు. ఆళ్ల రామకృష్టా రెడ్డి తనకు చాలా దగ్గర మనిషి అని పేర్కొన్నారు. ఆయన ఏ పార్టీలో ఉన్నా.. ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. వైసీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నాటి నుంచి ఆయనపై ఉన్న ఒత్తిడి అంతా.. ఇంతా కాదని పేర్కొన్నారు. ఆయన చెల్లిగా.. ఆ బాధను తాను అర్థం చేసుకోగలనని అన్నారు. ఒక మంచి వ్యక్తి.. రాంగ్ ప్లేస్‌లో ఉన్నారని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.

Tags:    

Similar News