గన్నవరంలో వైసీపీకి బిగ్ షాక్ : టీడీపీలోకి యార్లగడ్డ వెంకట్రావు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు గన్నవరం నేత యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు.

Update: 2023-08-18 11:35 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు గన్నవరం నేత యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. విజయవాడలో యార్లగడ్డ తన అనుచరులు అభిమానులతో శుక్రవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు అపాయింట్‌ కోరుతున్నానని చెప్పారు.గన్నవరం అభ్యర్థిగా తాను పనికొస్తానని భావిస్తే టికెట్‌ ఇవ్వాలని యార్లగడ్డ కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పైనా, సజ్జల రామకృష్ణారెడ్డిపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం తాను అహర్నిశలు శ్రమించానని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ అడిగితే ఇవ్వడం లేదన్నారు. టికెట్ ఇవ్వకపోగా ఉంటే ఉండండి పోతే పొండి అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అనడం బాధించిందన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో పాటుపడితే అలాంటి తనపట్ల సజ్జల వ్యవహరించిన తీరు తనను కలచివేసిందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ పులివెందుల నుంచి పోటీ చేసి అసెంబ్లీకి వస్తారని..అలాగే తాను గన్నవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేశారు. జగనన్న అసెంబ్లీ కలుద్దామంటూ యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. 

ఒక్క టీడీపీ నేతలను కలవలేదు

వైసీపీలో ఉండగా తాను ఒక్కసారి కూడా ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడిని కలవలేదని యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు.టీడీపీ నేతలను తాను కలిశానని ముఖ్యమంత్రి నమ్మితే అది ఇంటిలిజెన్స్ వైఫల్యమేనని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు బహిరంగంగా చెబుతున్న మాజీసీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ తీసుకుని తెలుగుదేశం పార్టీలో చేరతానని ప్రకటించారు. నా కార్యకర్తలు, నమ్మినవారి కోసం గన్నవరంలో పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. శాసనసభలో ఎమ్మెల్యే హోదాలో వైఎస్ జగన్‌ని కలుస్తానని యార్లగడ్డ వెంకట్రావు కీలక వ్యాఖ్యలు చేశారు. 


Read More : వైసీపీకి యార్లగడ్డ రాజీనామా.... సజ్జల రియాక్షన్ ఇదే..!


Similar News