BIG BREAKING : కేశినేని శ్వేత సంచలన నిర్ణయం.. ఆత్మగౌరవం లేని చోట పనిచేయబోమని వ్యాఖ్యలు

ఎవరూ ఊహించని విధంగా విజయవాడ సిట్టింగ్ ఎమ్మెల్యే కేశినేని నాని కూతురు కేశినేని శ్వేత తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు.

Update: 2024-01-08 06:41 GMT
BIG BREAKING : కేశినేని శ్వేత సంచలన నిర్ణయం.. ఆత్మగౌరవం లేని చోట పనిచేయబోమని వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్ : ఎవరూ ఊహించని విధంగా విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని కూతురు కేశినేని శ్వేత తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను విజయవాడ మున్సిపల్ మేయర్‌కు అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తన వ్యక్తిగత కారణాలతోనే కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశానని పేర్కొన్నారు. తాను పార్టీని వీడాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదని అన్నారు. కేవలం ముగ్గురి స్వార్థం వల్ల మా కార్పొరేటర్ అభ్యర్థులు నష్టపోయారని తెలిపారు. ఆత్మగౌరవం లేని చోట తాము పని చేయబోమని స్పష్టం చేశారు. కాగా, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో విజయవాడ నుంచి తనకు టికెట్ లేదని తెలియడంతో ఎంపీ కేశినేని నాని నిన్న, ఇవాళ ఉదయం ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.   

Tags:    

Similar News