Bhumana: జగన్ తిరుమలకు వస్తుంటే.. ప్రభుత్వానికి భయమెందుకో: టీటీడీ మాజీ చైర్మన్ హాట్ కామెంట్స్

మాజీ సీఎం జగన్ (Former CM Jagan) తిరుమలకు వస్తుంటే ప్రభుత్వానికి భయమెందుకో అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డి (Bhumana Karunakar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-09-27 06:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: మాజీ సీఎం జగన్ (Former CM Jagan) తిరుమలకు వస్తుంటే ప్రభుత్వానికి భయమెందుకో అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డి (Bhumana Karunakar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ (YCP) కార్యకర్తలను పోలీసులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఎవరైనా శ్రీవారిని దర్శించుకోవచ్చనే విషయాన్ని సనాతన ధర్మం చెబుతోందని అన్నారు. గతంలోనూ స్వామి వారిని మాజీ సీఎం జగన్ ఎన్నోసార్లు దర్శించుకున్నారని, ఆయనను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని అన్నారు.

చంద్రబాబు పాశవిక విధానాలను తాము ఎన్నటికీ వ్యతిరేకిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. వెయ్యి నాలుకల ధోరణిని సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఇప్పటికైనా మానుకోవాలని హితవు పలికారు. ఇక పవన్ (Pavan) హైందవ ధ్వజ స్తంభం మాదిరిగా ఫీల్ అవుతున్నాడని దుయ్యబట్టారు. మరో పార్టీ బీజేపీ (BJP) హిందువులంటే తామే అన్నట్లుగా ఆ పార్టీ కార్యకర్తలు భ్రమలో ఉన్నారని ఆరోపించారు. ఒకవేళ జగన్ నుంచి డిక్లరేషన్‌ (Declaration) అడిగితే.. ఈ కూటమి ప్రభుత్వానికి పతనం ఖాయమని అన్నారు. జగన్‌ డిక్లరేషన్‌ ఇవ్వకపోతే.. దర్శనానికి అనుమతి లేదనే హక్కు టీటీడీకి కూడా లేదని తెలిపారు. డిక్లరేషన్‌ వెనుక రాజకీయ కుట్ర ఉందని.. ప్రభుత్వం ఎంత నిర్బంధిస్తే అంత పైకి లేస్తా భూమన అన్నారు.


Similar News