చంద్రబాబుపై ఎటాక్.. మాజీ మంత్రి Kodali Nani నాని కీలక వ్యాఖ్యలు
మాజీ సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లో లేని సమస్యలను సృష్టిస్తున్నారని మాజీమంత్రి కొడాలి నాని విమర్శించారు.
దిశ, వెబ్‌డెస్క్: మాజీ సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్‌లో లేని సమస్యలను సృష్టిస్తున్నారని మాజీమంత్రి కొడాలి నాని విమర్శించారు. చంద్రబాబుపై జరిగిన రాయి దాడిపై ఆయన సెటైర్లు వేశారు. చిన్న గులక రాయితో చంద్రబాబుపై హత్యయత్నం జరిగిందట అని ఎద్దేవా చేశారు. ఎవరో తాగుబోతులు గొడవ చేస్తే.. దానికి పవన్ కల్యాణ్ హత్యకు రెక్కీ నిర్వాహించారని జనసేన ఆరోపిస్తోందన్నారు. టీడీపీ, జనసేన డ్రామాలు చేస్తున్నాయని మండిపడ్డారు. కేఏ పాల్ కన్నా వెనకబడిపోయానని.. పవన్ కల్యాణ్ ఇప్పటం వచ్చారని సెటైర్ వేశారు. కేఏ పాల్‌ను మించి హడావుడి చేయాలని ఇప్పటంలో పవన్ కల్యాణ్ ట్రై చేశారన్నారు. ఎన్నడైనా విపక్షాలు నిర్మాణాత్మకంగా ఒక్క సలహా అయినా ఇచ్చాయా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పొలిటికల్ టూరిస్ట్లని ఫైర్ అయ్యారు.