పోలింగ్ వేళ రాష్ట్రంలో సంచలనం.. నాటు బాంబులతో ఆ రెండు గ్రూపుల మధ్య భయానక దాడి
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఉత్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలుచోట్ల వైసీపీ, టీడీపీ, జనసేన వర్గీయుల మధ్య ఘర్షణలు జరిగాయి.
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఉత్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలుచోట్ల వైసీపీ, టీడీపీ, జనసేన వర్గీయుల మధ్య ఘర్షణలు జరిగాయి. మరొకొన్ని ఎంపీ, ఎమ్మెల్యేలు రెచ్చిపోయారు. ఒకరు ఓటర్‌ను కాలతో తంతే.. మరొకరు చెంప చెల్లుమణిపించారు. ఈ పరిణామాలతో పలుచోట్ల ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఇదిలా ఉండగా.. పల్నాడులో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ నేతలు, కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో వారు ఒకరిపై ఒకరు నాటు బాంబుబు, పెట్రోల్ సీసాలతో దాడులు చేశారు. రెవెన్యూ సిబ్బంది వాహనాలు తగులబెట్టారు. ఈ దాడుల్లో దాదాపు 10 మంది వరకు తీవ్ర గాయాలపాలయ్యారు. పల్నాడు జిల్లా చీమలమర్రి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. భారీ బందోబస్తు మధ్య ఇరు వర్గాలను చెదరగొట్టారు.