విజయసాయిరెడ్డి డీఎన్ఏ టెస్ట్‌‌కు రావాల్సిందే: మదన్ మోహన్

Update: 2024-07-15 12:43 GMT
విజయసాయిరెడ్డి డీఎన్ఏ టెస్ట్‌‌కు రావాల్సిందే: మదన్ మోహన్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: విజయసాయిరెడ్డి డీఎన్ఏ టెస్ట్‌‌కు రావాల్సిందేనని అసిస్టెంట్ ప్రొఫెసర్, దేవాదాయ శాఖ మహిళా అసిస్టెంట్ కమిషనర్‌ శాంతి భర్త మదన్ మోహన్ అన్నారు. తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భందాల్చిందని, అందుకు కారణం విజయసాయిరెడ్డినేనని హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించి ఆయన మరోసారి ఆరోపణలు చేశారు. విజయసాయిరెడ్డి అడగంతోనే ఐవీఎఫ్ ద్వారా బాబును కన్నానని తన భార్య శాంతినే చెప్పిందని మదన్ మోహన్ తెలిపారు. ఎవరి బిడ్డ అని తెలిసేంత వరకూ తన పోరాటం ఆగదని చెప్పారు. ఐవీఎఫ్ డాక్యుమెంట్లపై సుభాష్ అనే వ్యక్తి సంతకం కూడా ఉందని చెప్పారు. సుభాష్ తో పాటు విజయసాయిరెడ్డిపై తనకు అనుమానం ఉందని, వాళ్లిద్దరూ కూడా డీఎన్ఏ టెస్ట్‌కు రావాల్సిందేనన్నారు. ఆ బిడ్డకు ఫాదర్ ఎవరో తెలియాలని మదన్ మోహన్ తెలిపారు. తాను అమెరికాలో ఉండగా రెండేళ్లుగా నడిచిన కథను బయటకు తీయడానికి 7 నెలలు పట్టిందని చెప్పారు. తన దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయని, దయ చేసి సత్యాన్ని బతికించాలని మదన్ మోహన్ మీడియాను కోరారు. 

Tags:    

Similar News