రైసు మిల్లులో తనిఖీలు.. షాకైన అధికారులు, పోలీసులు

మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరగనుండటంతో నేతలు ప్రలోభాలకు తెర తీస్తున్నారు..

Update: 2024-05-10 05:51 GMT

దిశ, వెబ్ డెస్క్: మరో రెండు రోజుల్లో ఎన్నికలు జరగనుండటంతో నేతలు ప్రలోభాలకు తెర తీస్తున్నారు. విచ్చలవిడిగా నగదు, మద్యం, చీరలు, గిఫ్టుల పంపిణీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్, పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. భారీగా డబ్బు, మద్యం స్వాధీనం చేసుకుంటున్నారు.

తాజాగా కృష్ణా జిల్లా బాపులపాడు మండలం తిప్పనగుంటలో ఎన్నికల అధికారులు, పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ రైస్ మిల్లులో గోవా మద్యం నిల్వచేసినట్లు సీవిజిల్ యాప్‌కు సమాచారం అందింది. దీంతో హుటాహుటిన వెళ్లి రైస్ మిల్లులో సోదాలు చేశారు. 125 కేసుల గోవా మద్యాన్ని గుర్తించారు. ఓటర్లకు పంపిణీ చేసేందుకే గోవా నుంచి మద్యాన్ని తీసుకొచ్చినట్లు గుర్తించారు. రైస్ మిల్లు యజమాని వివరణ ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. మద్యాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Similar News